వ్యూహం తెలుగు

టాబ్లెట్‌ల కోసం ఇంకా సిద్ధం కావడం లేదు

ఈ వెబ్‌సైట్ టాబ్లెట్ స్క్రీన్‌ల కోసం ఇంకా అభివృద్ధిలో ఉంది. దయచేసి మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో తెరవండి.

This site is still under development for tablet screens. Please open it on a mobile phone or a laptop.

అక్కడ ఎదురుగాలి..ఇక్కడ చల్లటి గాలి

ఎక్కడో అమెరికాలో ఎన్నికలు జరిగితే మనకేమిటి సంబంధం. రౌండు రౌండుకూ ఫలితాలను బేరీజు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ట్రంప్‌ వెనుకపడుతున్నా..పడి లేస్తున్నాడా ఇవన్నీ 9కోట్ల మంది తెలుగువారికి ఎందుకు? కానీ ఇవన్నీ మనవాళ్లకు అవసరమే. లక్షలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, హెచ్‌1 వీసా మీద ఉన్న తెలుగువారు గడిచిన రెండేళ్లుగా ట్రంప్‌ దెబ్బకు విలవిలలాడుతున్న పరిస్థితి తెలిసిందే.

అక్కడ ఎదురుగాలి..ఇక్కడ చల్లటి గాలి

వీసాల తిరస్కరణతో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. కొంతమంది కాన్పుకోసం ఇక్కడికొచ్చిన మహిళలు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేకపోతున్నారు. భర్త వీసా స్లాట్‌ లేక హైదరాబాద్‌కో అమరావతికో రాలేక పోతున్నారు. అందుకే అమెరికాలో జరిగే మధ్యంత ఎన్నికల ఫలితాలపై కంటిమీద రెప్పవాల్చకుండా అమెరికాలో ఉంటున్న తెలుగువారి బంధులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు చూస్తున్నారు. బుధవారం ఉదయం ఎక్కడ చాయ్‌ కొట్ల దగ్గరికెళ్లినా ఇదే చర్చ. అమెరికాలో జరిగిన మధ్యంతర (మిడ్‌టర్మ్‌) ఎన్నికల్లో డెమోక్రాట్‌లు సంపూర్ణ విజయం సాధించారు. ఈ ఒక్క వార్తతో లక్షలాదిమంది తెలుగువారు ఊపిరి పీల్చుకుంటున్నారు. డెమొక్రాట్‌లు విజయం సాధించారని కాదు, ట్రంప్‌ ఓడిపోయాడని ఈ ఆనందం. ఎంతో తెలుగువారి ఆశలపై నీళ్లు చల్లి ఇబ్బందులకు గురిచేస్తున్న తెలుగువారు మరో రెండేళ్లు ఉగ్గపట్టి ఉండాల్సిందే. ఈ రెండేళ్లు ట్రంప్‌ చేసే చట్టాలను అడ్డుకునే అవకాశం డెమొక్రాట్‌లకు ఈ విజయంతో వస్తుంది. ఇటీవలి కాలంలో ఇరాన్‌తో యుద్ధం చేయడం, భారతదేశంపై అపరిమిత సుంకాలు విధించడం, పలు దేశాలతో పనికిమాలిన దౌత్యసంబంధాలు వెరసి ట్రంప్‌ కారణంగా పలు వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా అమెరికన్లు విభజన కోలుకోవడం లేదు, పరిష్కార మార్గాలు కోరుకుంటున్నారు అని అన్ని దేశాలను కలుపుకుని పోయే ఆలోచనతో ఉన్నారని మాట్లాడారు. తాజా ఎన్నికలు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌లను ఖచ్చితంగా ఓడించగలిగే ఎన్నికలను అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా అమెరికాలో ట్రంప్‌కు తగిలిన ఎదురుగాలి పలువురు తెలుగువారికి మాత్రం తుఫాను సమయంలో వీచే చల్లగాలుల్లా తగిలాయని చెప్పడంలో సందేహం లేదు.

Designed and Developed by
Contact