వ్యూహం తెలుగు

టాబ్లెట్‌ల కోసం ఇంకా సిద్ధం కావడం లేదు

ఈ వెబ్‌సైట్ టాబ్లెట్ స్క్రీన్‌ల కోసం ఇంకా అభివృద్ధిలో ఉంది. దయచేసి మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో తెరవండి.

This site is still under development for tablet screens. Please open it on a mobile phone or a laptop.

కొన్ని సార్లు యాదృచ్చికమో, అదృష్టమో తెలియదుగానీ అరుదైన సంఘటనలు ఎదురవుతూంటాయి. అలాంటి అక్టోబర్‌ 24న న్యూజిలాండ్‌ దేశంలోని క్రైస్ట్‌ చర్చ్‌లో జరిగింది. ఒక అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగున్న సందర్భంగా ఇద్దరూ తెలుగువారే మ్యాచ్‌ను గెలిపించడం ఒక అద్భుతం.

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా

బ్యాటింగ్‌లో ఇప్పటికే ఇండియన్‌ టీమ్‌లో స్థిరమైన స్థానం సంపాదించుకున్న తిలక్‌వర్మ, ఆల్‌రౌండర్ల లోటును పూడ్చడానికి మళ్లీ జట్టులోకి వచ్చిన నితీష్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ కలిసి న్యూజిలాండ్‌ జట్టును న్యూజిలాండ్‌లోనే ఓడించడం అనేది ఆషామాషీ కాదు. ఒక దశలో 80 పరుగలకే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లు అందరూ ఔట్‌ అయి కష్టాల్లో ఉన్న ఇండియాను ఈ ఇద్దరూ బ్యాట్స్‌మెన్‌లు గట్టెక్కించిన తీరు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసింది. ఆ ఇద్దరూ తెలుగువారు కావడం మరో విశేషం. భారీ రన్‌రేట్‌ కళ్లెదుట ఉన్నా ఎలాంటి అదురు బెదురు లేకుండా స్వదేశంలో న్యూజిలాండ్‌ జట్టును ఓడించిన తీరు చూస్తుంటే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనిపించక మానదు. 15 ఓవర్ల సమయంలో ఇండియా స్కోరు 112.అంటే సరాసరి 30 బాళ్లలో 68 పరుగులు చేయాల్సిన తరుణంలో తిలక్‌వర్మ, నితీష్‌కుమార్‌ రెడ్డి చూపిన తెగువ, చొరవ అమోఘం, అద్భుతం. సాధారణ పరిస్థితుల్లో ఆడటం వేరు, గెలుపోటములు దోబూచులాడుతున్న సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో జట్టు గెలుపును భుజాలమీద వేసుకుని నడిపించడం వేరు. ఈ ఇద్దరు కుర్రాళ్లు క్లిష్టమైన విజయాన్ని నల్లేరుమీద నడకలా చేసి ఇండియాను రెండో వండేలో గెలిపించిన తీరు తెలుగువారే కాదు భారతీయులెవరూ మర్చిపోలేనిది. పైగా వికెట్ల మధ్య పరిగెడుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్న తెలుగుభాష వికెట్లకు అమర్చిన మైక్రోఫోన్‌ల ద్వారా బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు ఇద్దరు కుర్రాళ్లు మాట్లాడిన భాష కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. వన్‌మోర్‌ తెలుగు…డబల్‌ వన్స్‌మోర్‌ తెలుగు కుర్రాళ్లు.

Designed and Developed by
Contact